వృషభ రాశి
| ఆదాయం | 5 | వ్యయం | 14 |
| రాజపూజ్యం | 5 | అవమానం | 4 |
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయం, తృతీయం, చతుర్దంలో గురువు, చతుర్ధ, తృతీయంలో కేతువు, దశమం, భాగ్యంలో రాహువు, లాభంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు.ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీనారాయణ పాశుపత హోమం జరిపించండి. చేతికి శక్తి కంకణం ధరించండి.
ఆదివారం లేదా శనివారం సూర్య నారాయణ అర్చన కచ్చితంగా చేయాలి. గంధంతో పూజ చేసి, అలా అలంకరించిన బొట్టుని ప్రసాదంగా తీసుకొని నుదుటన ధరించాలి. శుక్లపక్ష అష్టమి రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు ప్రతి రోజు ధరించాలి.
విదేశాలలో ఉన్నవారికి చేయలేనంత పని ఇచ్చి మీ అంతట మీరే ఉద్యోగం మానేసేలాగా మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. తాత్కాలిక సాధారణ ఉద్యోగం మాత్రమే లభిస్తుంది తృప్తిని మాత్రం ఇవ్వదు. కార్యాలయంలో మీ వ్యక్తిగత అభివృద్ధి చూసి ఓర్వలేక కులు కొనేవారు ఉంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలు అందుకుంటారు.
ప్రాజెక్టులు, clients సమర్ధించ గలుగుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో ఉద్యోగం మారాలి అన్న ఆలోచనలు కలుగుతాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది.వ్యాపారంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోతారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, స్వర్ణాభరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేస్తారు. స్వగృహాన్ని కొనుగోలు చేస్తారు. స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. త్వరగా కోపం రావడం, అతికోపం,అజాగ్రత్త వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది దీని వలన గొడవలు జరుగుతాయి.
యోగా మెడిటేషన్ సూర్య నమస్కారాలు వ్యక్తిగత ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చాలా వరకు తీసుకుంటారు.భూ సమస్యలు తీరి భూ లాభాలు పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు అందుకుంటారు.
ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. గోమాతని పూజించండి. ఆవుకి ఆహారం మంచినీళ్లు అందించండి. ఆ గో సేవ ప్రాంగణం దగ్గర లో కూర్చొని నవగ్రహ స్తోత్రం చేయండి.ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు పోయి మంచి ఫలితాలు పొందుతారు.