వృశ్చిక రాశి
| ఆదాయం | 11 | వ్యయం | 5 |
| రాజపూజ్యం | 2 | అవమానం | 6 |
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమం, భాగ్యం, దశమంలో గురువు, చతుర్ధ, తృతీయంలో రాహువు, పంచమంలో శనీశ్వరుడు, దశమ, భాగ్యంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అంగారక పాశుపత హెరామ జరిపించండి. చేతికి పాశుపత కంకణం ధరించండి.ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రం చదవండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయండి. ఆ బొట్టుని ప్రతిరోజు ధరించండి. ఎరుపు వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.
మంచి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తారు, కానీ తాత్కాలిక చిన్న ఉద్యోగాన్ని మాత్రమే పొందుతారు. వృత్తిరీత్యా వ్యవహార రీత్యా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఉన్నవారికి అవకతవకలు అంటే స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా కొత్త సమస్యలు ప్రారంభమవుతాయి.
ప్రథమ భాగం చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. కొంతకాలం వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. పరోక్షంగా ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది. వ్యాపారంలో స్థిరమైన ఆదాయం కోసం ఎంతగానో శ్రమిస్తారు. ఎన్నో సమస్యలు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు కాంపిటీషన్ మరింతగా పెరుగుతుంది. ఎన్నో ప్రయత్నాల ద్వారా రికమండేషన్, తర్వాత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాణిజ్యపరమైన ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని వ్యాపారాన్ని పెంచుకుంటారు. సంవత్సర ద్వితీయ భాగంలో వ్యాపారం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణం అంశాలు నిదానంగా నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అవి వేగంగా పూర్తి కాకపోవచ్చు .అయిన వాళ్ళ రూపంలో శత్రువులు ఉన్నందువలన తల్లి ప్రేమ కొన్నాళ్లు కరువు అవుతుంది.ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటారు.
ప్రయాణాలు, చిన్న పొన్న ప్రయాణాలు, అనుకూలంగా ఉంటాయి. వెళ్లిన ప్రతి పనిలోనూ స్వల్పమైన ఆటంకాలు ఏర్పడటం మళ్ళీ పునర్ ప్రయాణాలు అప్పుడు పనులు పూర్తి కావడం. ఈ విధమైన పరిణామాలు ఏర్పడతాయి. సాయంత్రం సంధ్య వేళ అశుభాలు మాట్లాడటం చేయవద్దు, నిరాశగా వ్యవహరించొద్దు. సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ దేవి స్తోత్రం చదవండి లేదా వినండి.
ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి కలిసొస్తుంది. మానసికంగా, శారీరకంగా ఉత్తేజాన్ని పొందుతారు.