Subhatithi™

తుల రాశి

ఆదాయం5వ్యయం14
రాజపూజ్యం6అవమానం3

తులారాశి ఈ సంవత్సరం భాగ్యం, దశమం, లాభంలో గురువు, పంచమం, చతుర్దంలో రాహువు, షష్టమంలో శనీశ్వరుడు, బాభం దశమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు, ఈ రాశిలో జన్మించిన వారు వనదుర్గ హోమం జరిపించండి. చేతికి మహా పాశుపత కంకణం ధరించండి. 

మంగళవారం, శుక్రవారం, ఆదివారం, దుర్గాదేవి అష్టోత్తరం చదవండి. అమ్మవారి దేవాలయంలో వారంలో ఒకరోజు కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధరించండి. 

 సంపాదించిన ధనంలో కొద్ది భాగాన్ని పిల్లల పేరు మీద భద్రపరచాలని విస్తృత ప్రయత్నం చేస్తారు. ఆఖరి నిమిషాలలో మార్పులు ఏర్పడటం ఆ ధనం ఖర్చు కావడం బాధకి గురిచేస్తుంది.కొత్త ఉద్యోగ ప్రయత్నాలు జూన్ దాటిన తర్వాత తాత్కాలిక ఉద్యోగం సాధారణ ఉద్యోగాన్ని పొందుతారు. ప్రస్తుతం ఉన్నచోట నిలకడ లేక పని చేయలేక ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఉంటాయి.వ్యాపారంలో ఉన్నవారికి కొత్త మార్గాలు కనిపిస్తాయి ఆదాయం పెంచుకోవడం కోసం కొత్త ప్రయత్నాల్లో మునుగుతారు.



గత కొన్ని సంవత్సరాల తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రయోజనాలను దక్కించుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయాలలో  శుభవార్త వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.చిన్న చిన్న పనులు మూడు వంతులు సజావుగా సాగుతాయి. ఏవో  కొన్ని విషయాలు మినహాయింపు. ఒత్తిడి కలిగించే ప్రైవేటు ఉద్యోగాల కన్నా సొంత వ్యాపారం మేలు కావచ్చు మన పని మనం చేసుకుని మనకు రావాల్సిన కితాబు మనకి వస్తుంది కదా అన్నట్టు భావిస్తారు. పొరపాటు నిర్ణయాలు చేస్తారు. వ్యక్తిగత జాతకంలో బలం ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారాలు ప్రారంభించండి. అనవసరమైన నిర్ణయాలు మాత్రం చేయవద్దు.ఎలక్ట్రానిక్ వ్యాపారాలలో ఉన్న వారికి మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. 

 ఫర్నిచర్ వ్యాపారస్తులకు, ఇంటీరియర్, డెకరేషన్, వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంది.శుభకార్యాలు చేయగలుగుతారు.  రాబోయే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్తగా నేర్చుకోవాలని అన్ని ఆలోచనలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. పెయింటింగ్,  ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆకర్షితులవుతారు. 

 

ప్రతిరోజు గణపతి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, రవి స్తోత్రం చదవండి. నవగ్రహాల ప్రదక్షణ చేసుకొని ఎరుపు వత్తులు, అష్టమూలికా తైలంతో రవి గ్రహం దగ్గర దీపారాధన చేయండి.  తేజా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి పొందుతారు.

error: Content is protected !!