మిధున రాశి
| ఆదాయం | 8 | వ్యయం | 11 |
| రాజపూజ్యం | 1 | అవమానం | 7 |
మిధున రాశి వారికి ఈ సంవత్సరం లగ్నం, ద్వితీయం, తృతీయంలో గురువు, తృతీయం, ద్వితీయంలో కేతువు, భాగ్యం, అష్టమంలో రాహువు, దశమంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు.
ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య కంకణం ధరించండి.
గురువారం, శుక్రవారం విష్ణు సహస్రనామం చదవాలి. సిద్ద గంధం తో స్వామివారికి అర్చన చేయండి.ప్రతిరోజు నుదుటన ఆ గంధాన్ని ధరించండి. ఆకుపచ్చ వత్తులు అష్టమూలికా తైలంతో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర బుధవారం రోజున దీపారాధన చేయండి.
తాత్కాలిక ఉద్యోగాలు, ఒప్పందం మీద అతి కష్టం మీద తాత్కాలిక ఉద్యోగాని మాత్రమే పొందుతారు. ప్రస్తుతానికి ఖర్చులు వెళ్ళాయి గలుగుతారు.శాశ్వత లేదా స్థిరమైన ఉద్యోగం కోసం కొంతకాలం నిరీక్షించాలి. వ్యాపారంలో ఉన్న వారికి పెట్టుబడులునిర్వహణ విపరీతంగా పెరుగుతుంది వచ్చే ఆదాయం చేతిలో రూపాయి కూడా మిగలదు.
సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఆలస్యంగా ఆయన ప్రమోషన్ మీకు రావాల్సిన క్రెడిట్ లభిస్తుంది.ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది.ప్రతి ఒక్క పనికి మితిమీరి శ్రమించాల్సి వస్తుంది.ఎంతో కష్టపడి, అందరితో మాట పడి, ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మీరు అనుకున్న మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త భాష, కొత్త విశేషాలను నేర్చుకుంటారు. గో సేవా కార్యక్రమాలు విశేషంగా జరిపిస్తారు.ఒక దగ్గర పెట్టిన పెద్ద పెట్టుబడి ఎదగదు కదలదు అందని ద్రాక్ష లాగా బాధపెడుతుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడతారు, వైద్యుల సలహాలు సూచనలు పాటించిన ఫలితం కనిపించదు.చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జాగ్రత్త అవసరం ఎంతో ప్రయత్నం చేస్తే గాని ఫలితాలు కనిపించవు ఒకటికి రెండుసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు.
శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి.ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తారు కొత్త సమస్యలు ప్రారంభమవుతాయి.
ఈ రాశి వారికి శత్రువులు, నరదిష్టి, ఎక్కువగా ఉంది పౌర్ణమి రోజు శివాలయంలో గంగా జలాలు, చెరుకు రసం గంధంతో స్వామివారికి అభిషేకం చేయించాలి ప్రతివారం దిష్టి తీసుకుని నిమ్మకాయలు పారే నీటిలో వేయాలి. దుర్గాదేవి కవచం చదువుకోవాలి.