Subhatithi™

మేష రాశి

ఆదాయం11వ్యయం5
రాజపూజ్యం2అవమానం4

మేష రాశి వారికి ఈ సంవత్సరం తృతీయం, చతుర్ధం, పంచమంలో గురువు, పంచమం, చతుర్దంలో కేతువు, లాభం, దశమంలో రాహువు, వ్యయంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. ఈ రాశిలో జన్మించిన వారు మన్యు పాశుపత హోమం జరిపించండి. చేతికి కుబేర కంకణం ధరించండి. శనికి తైలాభిషేకం ప్రతి వారం చేయాలి , హనుమాన్ చాలీసా / ఆంజనేయ దండకం చదవాలి.

 

Mental stress, health issues, depression, ఉన్నవారు నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి పటిక బెల్లం ప్రసాదంగా పంచాలి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం దొరకడం కష్టం. వ్యాపారంలో ఉన్నవారికి అధికారుల నుంచి వేధింపులు ప్రారంభం. చాలా కష్టపడితే గాని ఫలితాలు కనిపించవు. ఉద్యోగం నిలబెట్టుకోలేరు, వ్యాపారం చేయడం కూడా కష్టంగా మారుతుంది. కానీ మీ జీవితం చూసిన వారికి పూలబాట లాగా అనిపిస్తుంది. మీరు అక్కర్లేనంత శ్రమ పడుతున్నారు. ఆందోళన పడుతున్నారు అన్న విధంగా ఉంటుంది.ఒత్తిడి అధికంగా ఉంటుంది. కళా, సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు . లభిస్తాయి ప్రజాదరణ పెరుగుతుంది. వ్యాపారంలో చాలా సమస్యలు వస్తాయి. జన్మ జాతకం సహకరిస్తే వ్యాపారాన్ని నిలబెట్టుకుంటారు.ప్రతి విషయంలోనూ పక్క వాళ్ళ సహాయం స్నేహితుల సహాయం తప్పనిసరిగా మారుతుంది. వచ్చిన ఆదాయం ఖర్చులకి సరిపోదు. కొత్త రుణాలు చేస్తారు.

 

ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసుకొంటారు. కొన్ని ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది. మంచి ఫలితాలను పొందగలుగుతారు.

స్వయం అభివృద్ధి / ఎదుగుదల కోసం ప్రయత్నం చేయండి.అశ్రద్ధ , బద్ధకం, నీరసం, కోపం ,అతి నిద్ర, దురాలవాట్లుకి కచ్చితంగా దూరంగా ఉండండి. కష్టపడటానికి ఎక్కువగా మీరు సిద్ధపడండి. మంచి జరుగుతుంది. చికిత్స, విధానాలు, మందులు తప్పవు. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఆదాయం ఉద్యోగం కోసం ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదవడం లేదా వినటం చేయాలి 11 గులాబి పూలతో అమ్మవారిని పూజించాలి కుంకుమతో అర్చన చేయాలి.ఇలా నెలకు రెండు సార్లు చేయాలి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది.

error: Content is protected !!