Subhatithi™

మకర రాశి

ఆదాయం2వ్యయం8
రాజపూజ్యం1అవమానం2

మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం లగ్నం, ద్వితీయంలో రాహువు, తృతీయంలో శనీశ్వరుడు, షష్టమం, సప్తమం, అష్టమంలో గురువు, అష్టమం, సప్తమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మి నారాయణ పాశుపత హోమం జరిపించండి. చేతికి కుబేర కంకణం ధరించండి. ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రం చదవండి.

 గురువారం, శుక్రవారం వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదివి గంధముతో స్వామివారికి అర్చన చేయండి. ఆ బొట్టుని ధరించండి.

 

 చిన్నపిల్లలు, పెద్ద వయసు కలిగిన వారికి చదువు, వైద్యానికి ఆర్థిక సహాయం చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని నీలం వత్తులు అష్టమూలికా తైలంతో రాహు గ్రహం దగ్గర దీపారాధన చేయండి.

 

ఉద్యోగాలలో  స్థిరత్వం ఉండదు. తరచూ ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడతాయి. ఉంటుందనుకున్న ఉద్యోగం చేయిజారేసరికి మానసికంగా శారీరకంగా ఆందోళన చెందుతారు. ఫీల్డ్ మార్చి ప్రయత్నం చేస్తే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఉన్న వారికి మీ తప్పులే ఎక్కువ ఉంటాయి. ఆలోచనలు నిలకడ ఉండదు.  ఎంతో శ్రమిస్తేనే మంచి జరుగుతుంది. పెట్టుబడులు మొత్తం  dead investment  గా మారిపోతాయి వాటి వలన ప్రయోజనాలు, లాభం, ఆదాయం, ఏమి ఉండదు.మీకు రావాల్సిన డబ్బులు రావు కానీ మీరు కట్టవలసిన వన్నీ టైంకే కట్టాల్సి వస్తుంది. 

 

అధునాతన సాంకేతిక పరికరాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని కొత్త అంశాలు నేర్చుకోవాలి అన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి.ఉద్యోగంలో మంచి పోటీ తత్వాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు .ప్రభుత్వపరమైన అధికారులు వాళ్లతో పరిచయాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి.

గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకున్న విధంగా నెరవేరుతాయి. శుభకార్యాలు, వివాహము, శంకుస్థాపన, గృహప్రవేశం, ఇతర శుభకార్యాలు ఘనంగా నిర్వహించ గలుగుతారు. మంచి పేరును పొందుతారు.

 

ఎంత కాలం నుండి ఒక ముఖ్యమైన విషయం గురించి  ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకుంటారు ఆ పని ఇప్పుడు చేస్తారు.విందు వినోదాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమించినవ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి కలిసిండాలన్న ఆలోచనలు ఉంటాయి.

అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. వెన్నునొప్పి, నడుం నొప్పి, శిలువేదన బాధిస్తాయి .

రుణాలకు సంబంధించిన విషయాలలో అనుకున్నది ఒకటి జరిగినది మరొకటి అన్న విధంగా లెక్కలు  తారుమారవుతాయి.కొంతమంది చెప్పుడు మాటలు వినడం మానడం మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. 

స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో ఉంచి ప్రతి శుక్రవారం, శనివారము ,ఆదివారము, భైరవాష్టోత్రము లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. ఎరుపు రంగు పువ్వులతో ఆ యంత్రాన్ని పూజించి ధూపం వేయండి. 

దీనివలన జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది. 

error: Content is protected !!