Subhatithi™

కర్కాటకం

ఆదాయం2వ్యయం11
రాజపూజ్యం4అవమానం7

కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం వ్యయం, లగ్నం, ద్వితీయంలో గురువు, ద్వితీయం, లగ్నంలో కేతువు, అష్టమం, సప్తమంలో రాహువు, భాగ్యంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు.

ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర హోమం జరిపించండి. మెడలో కౌముది ధరించండి. ప్రతిరోజు రుద్ర కవచం చదవడం లేదా వినడం చేయాలి. ఆదివారం లేదా సోమవారం శివాలయంలో గంధం పసుపుతో స్వామివారికి అభిషేకం జరిపించి. అభిషేకం తర్వాత ఈ ద్రవ్యాలను స్వామివారి అలంకరించి కొద్దిగా బుట్టని నుదుటన ధరించాలి.
అమ్మవారి ఆలయంలో పసుపుతో అర్చన చేయించండి. ఆ పసుపుని ప్రతిరోజు నుదుటిన బొట్టుగా ధరించండి. పండ్లు వస్త్రము తాంబూలంగా ఇవ్వండి.
చేతిలో ఉన్న ఉద్యోగం తృప్తి నివ్వదు. మే, తర్వాత నిరాశ ఎదురవుతుంది. ప్రమోషన్, క్రెడిట్, గుర్తింపు, ఇంక్రిమెంట్ లభించవు. కార్యాలయంలో రాజకీయాలు మరింత పెరుగుతాయి. ఉద్యోగం భరోసా ఇవ్వదు. వ్యాపారంలో ఉన్నవారికి పెట్టుబడులు మరింత పెరుగుతాయి. పరివారం సహకరించాల్సిన సేవకుల ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో సమస్యలు ఎదురవుతాయి భయాందోళన స్థితి కలుగుతుంది

నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిస వస్తాయి.కార్యాలయంలో కుట్రలు కుతంత్రాలు మరింత పెరుగుతాయి. అసత్య ప్రచారాలు, నిందలు, ఆరోపణలు, తట్టుకోలేరు.
ఉద్యోగం మానేయాలి అన్ని ఆలోచిస్తారు. వచ్చిన అవకాశాలను కూడా వద్దనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు ద్వితీయ ప్రయత్నంలో లభిస్తాయి.సబ్ కాంట్రాక్ట్ లాభిస్తాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.చాలా విషయాల్లో నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.సంతాన విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు.
దూర ప్రయాణాలు తీర్ధయాత్రలు చేయగలుగుతారు. మీ పేరు లేదా మీ వాళ్ళ పేరు మీద స్థిరాస్థులు కొనుగోలు చేసి లాభపడతారు. .కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి క్రీడా రంగంలో ఉన్న వారికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్లో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

కొంతకాలం భార్యాభర్తలిద్దరికీ అనారోగ్యం వస్తుంది. పెట్టిన పెట్టుబడులు, ఆగి ఉన్న ధనం కూడా తిరిగి చేతికొస్తుంది. ఋణ సదుపాయం లభిస్తుంది. పసుపు వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతి మంగళవారం, శుక్రవారం అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవండి లేదా వినండి. సాధ్యమైనంత వరకు స్త్రీలను గౌరవించండి. ప్రతి ఆదివారము రాళ్లుప్పుతో దిష్టి తీసుకోండి. ఇలా చేయడం వలన నరదిష్టి తొలగిపోయి.

error: Content is protected !!