Subhatithi™

కన్య రాశి

ఆదాయం8వ్యయం11
రాజపూజ్యం3అవమానం3

కన్యా రాశి వారికి ఈ సంవత్సరం దశమం, లాభం, వ్యయంలో గురువు, షష్టమం, పంచమంలో రాహువు, సప్తమంలో శనీశ్వరుడు, వ్యయం, లాభంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మహా పాశుపత హోమం జరిపించండి. చేతికి కుబేర కంకణం ధరించండి.మహాలక్ష్మి దేవి అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. ప్రతి శుక్రవారం, శనివారం అమ్మవారికి ఆవుపాలను పంచదారను ప్రసాదంగా నివేదించండి. చిన్న పిల్లలకు అరటి పండ్లు లేదా ఆ మాసాల్లో దొరికే పండ్లు ఇస్తూ ఉండండి.

అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవటానికి  శనివారం రోజు పరమాన్నం వెంకటేశ్వర స్వామి వారికి నివేదించండి. 

 

చిన్న ఉద్యోగం అతి కష్టం మీద లభిస్తుంది. కార్యాలయంలో రాజకీయాలు కొత్త కోణంలో ప్రారంభమవుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి లాభం ఉండదు నష్టం ఉండదు కానీ వ్యాపారం చాలా నిదానంగా ఎదుగుతుంది ఆశించిన స్థాయిలో మాత్రం ఎదుగుదల కనిపించదు.  వేధించేవారు ,చికాకు పెట్టేవాళ్లు, పనులకు  అడ్డం వస్తూ ఉంటారు.  ఉద్యోగం లేని వారికి గట్టి ప్రయత్నం తర్వాత మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్థులు కొనుగోలు చేసి లాభపడతారు.   అధికారులు, ముఖ్యమైన వాళ్ళతో ఆచితూచి మాట్లాడటం, సంబంధ బాంధవ్యాలు అతి జాగ్రత్తగా కొనసాగించాలి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది. క్రీడారంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు పొందుతారు. సంగీతం, సాహిత్యం పట్ల ఆకర్షితులవుతారు .చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారే పరిస్థితి ఉంది .జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాల్లో ప్రావీణ్యత ఉంటుంది.చదువు కోసం చేసే ప్రయత్నాలలో సమస్యలు ఎదురవుతాయి.

తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి.ప్రతి విషయంలోనూ గొడవలకి కాలు దువ్వే వాళ్ళని ఏదో ఒకటి నచ్చజెప్పి కూర్చోబెట్టాలని ఆలోచనలు తల నొప్పిగా మారుతుంది. తల్లిదండ్రుల శ్రేయస్సు కోరి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

నవగ్రహ ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత శివాలయాన్ని దర్శించండి యజ్ఞం భస్మంతో స్వామివారికి అర్చన చేయించి. ఆ వీపుదిని నుదుటున ధరించండి.

error: Content is protected !!