Subhatithi™

ధనుస్సు

ఆదాయం14వ్యయం11
రాజపూజ్యం1అవమానం2

ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయం, తృతీయంలో  రాహువు, చతుర్దంలో శనీశ్వరుడు, సప్తమం, అష్టమం, భాగ్యంలో గురువు, భాగ్యం అష్టమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మహా పాశుపత హోమం జరిపించండి. చేతికి శక్తి కంకణం ధరించండి.ప్రతిరోజూ శని స్తోత్రము రవి స్తోత్రం చదవండి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయండి. బెల్లం నువ్వులు స్వామివారికి నివేదించండి నలుగురికి అన్నదానం చేయండి లేదా కాకులకు మినప గారెలు పెట్టండి. 

సాధ్యమైనంత వరకు మీ కిందిస్థాయి ఉద్యోగస్తులను పరిచారకులు, గౌరవం ఇచ్చి సంబోధించండి. అతి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతుంది. కాంప్రమైజ్ అవుతారు చిన్న ఉద్యోగాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తారు.

 కార్యాలయంలో కొంతమంది మీ మీద ఈర్ష ద్వేషం అసూయ కలిగి ఉంటారు వీళ్ళతో సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఉన్న వారికి అంత అంత  మాత్రం  ఫలితాలు ఉంటాయి. వ్యాపారం కొనసాగించడానికి ధనం కరువవుతుంది, గుర్తింపు ప్రజాదరణ కరువు అవుతుంది. కష్టం మీద లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు.ఉద్యోగంలో ఒత్తిడి మరింత పెరుగుతుంది.కార్యాలయంలో మీరంటే పడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక కారణంతో పై అధికారుల ముందు మిమ్మల్ని ఇబ్బందికి  గురి చేస్తుంటారు.

ఇంటీరియర్ డెకరేషన్ చేసే వారికి, సివిల్ ఇంజనీర్లకు, కాలం కలిసి వస్తుంది.వస్త్ర వ్యాపారస్తులు, సివిల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వ్యాపారస్తులకు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు.  కొత్త పెట్టుబడులు, వనరులను సమకూర్చుకొని మరొక బ్రాంచ్ / షాప్ ప్రారంభిస్తారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత శుభ ఫలితాలు అందుకుంటారు.  ఆదాయం మాత్రం మిగలదు.

కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచన లేదా plot  సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. చదువుకుంటున్న పిల్లలకు ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కుటుంబ చీలికలు, కుటుంబ పరువు మర్యాదలను వాటికీ సంబంధించిన అంశాలలో దృఢమైన అభిప్రాయంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

 నాట్యం పట్ల ఆకర్షితులవుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వెన్నునొప్పి లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడే అవకాశం ఉంటుంది. రుణాలను తీసుకొని కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు.

నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని కుజ గ్రహం దగ్గర ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. గోధుమ రవ్వతో తయారు చేసి ప్రసాదాన్ని మీ ఇష్ట దైవానికి నివేదించి ప్రసాదం స్వీకరించండి.

error: Content is protected !!