కుంభ రాశి
| ఆదాయం | 2 | వ్యయం | 8 |
| రాజపూజ్యం | 4 | అవమానం | 2 |
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం లగ్నం, వ్యయంలో రాహువు, ద్వితీయంలో శనీశ్వరుడు, పంచమం, షష్టమం, సప్తమంలో గురువు, సప్తమం, షష్టమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం జరిపించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి.
ప్రతి రోజు నవ దుర్గా స్తోత్రాన్ని చదవండి లేదా వినండి. ఎరుపు వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం వేళ వ్యాపార ప్రదేశాల్లో కూడా గుగ్గిలంతో ధూపం వేయండి
నరదిష్టి ఎక్కువగా తగిలే అవకాశం ఉన్నందువలన నరగోష యంత్రాన్ని జిల్లేడు గణపతిని ఇంటి వాకిలి బయట పెట్టించండి.
ఉద్యోగరీత్యా టెన్షన్ మొదలవుతాయి. స్వదేశానికి వచ్చేయాలనా ఆలోచనలు పెరుగుతాయి. కార్యాలయంలో కుట్రలు కుతంత్రాలు దీనికి ప్రధానమైన కారణం గా మారుతాయి. కొత్త అవకాశాలు లేక చింతిస్తారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి కాలక్షేపం చేయాలా అన్న ఆలోచన ఏర్పడతాయి.
వ్యాపారంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఉన్నదంతా ఊడ్చు పెట్టిన వ్యాపారం మొత్తం తినేస్తుంది అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. వచ్చే ఆదాయం తక్కువ, కంటికి కనిపించే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. ప్రజలు ఆకర్షించే విధంగా మీ ప్రయత్నాలు, ప్రణాళికలు ఉంటాయి.అనుకూలమైన వాతావరణం సన్నిహిత బృందం నుంచి సహచర బృందం నుంచి కూడా అందుకో గలుగుతారు.చేపట్టిన కార్యక్రమాలలో నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పడవ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చెయ్యాలని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రేమించి వివాహం చేసుకోవాలి ఆలోచనలు ముందుకి వెనక్కి సాగుతూ ఉంటాయి.దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది. మంచి ఫలితాలు మూడు వంతులు పొంద గలుగుతారు. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు.కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
నేత్ర సంబంధమైన వ్యాధులు, శిరోవేదన, స్పైనల్ డిస్క్ సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు అవసరం. వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి.పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచనలు కలిగి ఉంటారు.
బహుళ అష్టమి రోజున కాలభైరవుని దర్శించండి కాలభైరవ అష్టకాన్ని పఠించండి కాకులకి, కుక్కలకి
మంచినీళ్లు, ఆహారగా పెట్టండి. నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని శివ దర్శనం చేసుకోండి. స్వామివారి విభూదిని నుదుటున ధరించండి. కార్యానుకూలత కోసం ప్రత్యేకంగా గణపతికి గంధముతో అర్చన చేయించండి సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు సాధ్యపడినంతవరకు చేయండి.