Subhatithi™

సింహ రాశి

ఆదాయం5వ్యయం5
రాజపూజ్యం7అవమానం7

సింహ రాశి వారికి ఈ సంవత్సరం లాభం, వ్యయం, లగ్నంలో గురువు, లగ్నం, వ్యయంలో కేతువు, సప్తమం షష్టమలో రాహువు, అష్టమంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం జరిపించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి. శనికి తైలాభిషేకం ప్రతి వారం చేయండి. నల్ల నువ్వులు , కొబ్బరికాయ నివేదించండి. వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి. గంధంతో అర్చన చేయండి. గంధం బొట్టుగా  ధరించండి.  

   

 చిన్నపాటి ఉద్యోగానికి కూడా ఎంతో పోటీ ఉంటుంది. ఉద్యోగం రాదు, ఆఖరి రౌండ్ లో ఇంటర్వ్యూ పోతుంది. మీకు రావాల్సిన అపాయింట్మెంట్ లెటర్ మీకు రాదు నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అన్నీ ప్రయత్నం చేస్తారు.

 ఆర్థికంగా సంక్షోభం ఏర్పడుతుంది. వ్యాపారాలలో ఉన్నవారికి ఆదాయం చాలా తక్కువగా, ఖర్చులు ఎక్కువగా మారతాయి. విచిత్రమైన మార్పులు విచిత్రమైన ధోరణి జనాలలో రావడం వ్యాపారం నిలబెట్టుకోవడానికి చాలా కష్టంగా మారుతుంది. ఉద్యోగరీత్యా కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ద్వితీయార్థంలో మూడు వంతులు ఈ సమస్యలకు పరిష్కారం చెందుతాయి. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఉంటాయి.  వ్యాపారంలో కొత్త  సమస్యలు ఎదురవుతాయి.ఎంత పెట్టుబడి పెట్టిన ఆదాయం మాత్రం పెరగదు. పలుకుబడి తగ్గిపోతుంటుంది. ఆరోగ్య విషయంలో చతికిల పడతారు. ఎంత చేయవలసిన పనులు ఉన్న చేతకాక కూర్చుంటారు. కొత్త ఇన్వెస్టర్ల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఇనుము కన్స్ట్రక్షన్ మెటీరియల్, బ్యూటీ పార్లర్, హార్డ్వేర్ ఎలక్ట్రానిక్, డెకరేషన్, ఫుడ్ వ్యాపారాలు, బాగుంటాయి.  

సంతానం విషయంలో అసంతృప్తి నెలకొంటుంది.

భార్యాభర్తల అన్యోన్యత మీద ఎక్కువ మందికి ఏడుపు ఉంటాయి. కొంతమంది చెప్పే అబద్ధాలు కారణంగా ఎంతగానో మనసు కష్టపెట్టుకుంటారు.

 

క్రీడా రంగంలో ప్రావీణ్యత  సాధిస్తారు.పొదుపు పథకాలలో చిన్న మొత్తాలుగా ధనాన్ని దాస్తారు. స్థలాల విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు.ఇష్టపడ్డ వ్యక్తితో వివాహానికి మీరు చేసే ప్రయత్నాలకు అనేక రకాల ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయి.  చిన్న చిన్న ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు మంచి ఫలితాలను అందజేస్తాయి. 

ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి అన్న మాట వలన, కొన్ని నిర్ణయాలు ఆవేశంతో తీసుకుంటారు.స్వర్ణ ఆకర్షణ భైరవ యంత్రం ఇంట్లో ఉంచి శుక్రవారం, శనివారము భైరవ స్తోత్రం చదవండి.  లక్ష్మి తామర వత్తులు, అష్టమూలికా తైలంతో శుక్రవారం రోజు దీపారాధన చేయండి.

error: Content is protected !!